దసరా బతుకమ్మ సంబరాలు గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలి..
NEWS Oct 05,2024 05:43 pm
కథలాపూర్, మేడిపల్లి మండలాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాలలో ప్రధాన కూడల వద్ద ప్రత్యేక పూల కుండీలు ఏర్పాటు చేయాలని, ఓ కళాత్మకంగా గ్రామాలు కనబడాలని, గత ఏడాది దసరా బతుకమ్మ కంటే ఇప్పుడు చాలా బాగుంది అనే విధంగా గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్తంభానికి లైట్లు, ప్రధాన గుడాల వద్ద ఐ మాస్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.