సృజన స్రవంతి వాటర్ ప్లాంట్ ను ప్రారంభం
NEWS Oct 05,2024 05:45 pm
ఆగళి మండలం మాధుడి గ్రామంలో సృజల స్రవంతి తాగునీటి ప్లాంటును మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మడకశిర టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి శనివారం ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సృజల స్రవంతి ప్లాంట్ నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రారంభించాలని ప్రజలు కోరగా ఎమ్మెల్యే స్పందించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా సౌకర్యం కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి శనివారం మధుడి గ్రామంలో ప్రారంభించారు.