మల్లాపూర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 05,2024 02:48 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాలలకు 6వ తేది నుండి 13 వ తేది వరకు సెలవులు ప్రకటించినందున శనివారం చివరి పని దినం కావడంతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు. తిరిగి కాలేజీ 14వ తేది సోమవారం పునః ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.