Logo
Download our app
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
NEWS   Oct 05,2024 02:52 pm
ఇబ్రహీంపట్నం: బీసీల కులగనన చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 9న మెట్ పల్లి పాత బస్టాండ్ దగ్గర చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి అన్నారు. ఇబ్రహీంపట్నంలో శనివారం ఆయన మాట్లాడారు. దీక్షకు అధిక సంఖ్యలో బీసీలు తరలిరావాలని కోరారు. మాజీ ఎంపీపీ తోగిటి అంజయ్య, ప్రవీణ్, పురుషోత్తం, సుగుణాకర్, రమేష్, సత్యనారాయణ, రాజారెడ్డి తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source