కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
NEWS Oct 05,2024 02:53 pm
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను అందంగా రూపొందించి అనంతరం ఓచోట బతుకమ్మలను ఏర్పాటు చేసి బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హిమ్యా నాయక్, పలువురు అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.