పీవీకే ట్రస్టు నిత్యవసర సరుకులు పంపిణీ
NEWS Oct 05,2024 05:52 pm
వైయస్సార్ కాలనీ భీమరాజు గుట్ట జూపూడిలో పీవీకే ట్రస్ట్ చైర్మన్ పచ్చిగోళ్ళ వెంకటరత్న రాజ్ (పండు) చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వెంకటరత్నరాజు మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోతనపల్లి ప్రదీప్, గోపి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.