కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ ల పంపిణి
NEWS Oct 05,2024 05:55 pm
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ కాలనీ లో ఉన్న రామచంద్రపురం మండల్ తహసీల్దార్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామచంద్రాపురం మండల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను పంపిణి కార్యక్రమానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని చెక్ లను పంపిణి చేశారు. రామచంద్రపురంలో సుమారు 11 మందికి కల్యాణలక్ష్మి, 4 షాదీ ముబారక్ చెక్ లను పంపిణి చెయ్యడం జరిగింది. వారితో తహసీల్దార్, నాయకులు, పలువురు పాల్గొన్నారు.