వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్
NEWS Oct 05,2024 05:59 pm
TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆపై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.