ఘనంగా కాకా జయంతి వేడుకలు
NEWS Oct 05,2024 10:42 am
జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో శనివారం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకట్ స్వామి చిత్ర పటానికి పూలమాల వేసి ఆర్డీఓ పులి మధు సుధన్ నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకా ఆశయ సాధన కోసం పేద వర్గాల, అణగారిన వర్గాల, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం తపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తఫేజ్ఉల్ హుస్సేన్, కుమారస్వామి, అచ్యుత రెడ్డి, చరణ్, మూర్తి గౌస్ షరీఫ్, అర్చన, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.