సింగూరు 2 గేట్లు ఎత్తిన అధికారులు
NEWS Oct 05,2024 10:42 am
సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ మధ్య తరహా ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరిగింది. దీంతో శనివారం మధ్యాహ్నం జలాశయం రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు వరదను మంజీరా నదిలో వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 14,168 క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. దీంతో ప్రాజెక్టు సంబంధిత 6, 11వ నెంబర్ గేట్లు 1.5 మీటర్ల ఎత్తులో 16,284 క్యూసెక్కుల దిగువకు వదిలామని పేర్కొన్నారు.