కాలనీలో పేరుకుపోయిన చెత్త
NEWS Oct 05,2024 09:13 am
సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాత బస్టాండ్ వెనుక భాగంలోని రామ్ నగర్ రోడ్డుపైన పేరుకుపోయిన చెత్తను తొలగించడం లేదని స్థానికులు వాపోయారు. గాలికి మళ్లీ చెత్త ఇళ్లలోకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సేకరణ కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. చెత్తపై దోమలు పెరిగి విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, ఇప్పటికైన అధికారులు స్పందించి చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.