ABVP ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 05,2024 08:45 am
సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగుల పువ్వలతో బతుకమ్మలను తయారు చేశారు. మహిళలు, విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఏబీవీపీ కన్వీనర్ ఆకాశ్ మాట్లాడుతూ.. సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహనా కల్పించేందుకే బతుకమ్మ పండగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, తదితరులు పాల్గొన్నారు.