స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 05,2024 08:44 am
మెట్‌పల్లి పట్టణంలోని Oaklay (Kidzee) school International, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను చేశారు. అకాడమి డైరెక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. 9 రోజులపాటు అడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అని అన్నారు. ప్రిన్సిపాల్ సుమలత మాట్లాడుతూ.. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ జరుపుతారని చెప్పారు.