ఇళ్ల మధ్య పేరుకుపోయిన మురికి నీరు
NEWS Oct 05,2024 08:17 am
చిన్న శంకరంపేట: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల చిన్న కేంద్రంలోని బీడీ కాలనీలో డ్రైనేజ్ సమస్య రోజురోజుకు తీవ్రమౌతుంది. స్థానిక వాటర్ ట్యాంక్ పక్కన డ్రైనేజ్ నిర్మాణం సరిగా లేకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడ పేరుకుపోయి దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల వల్ల తాము వ్యాధుల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.