అతి పురాతనమైన జైన విగ్రహా చోరీ
NEWS Oct 05,2024 08:04 am
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో అతి పురాతనమైన జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేల్పగోండా గ్రామంలో జైన విగ్రహం చోరీకి గురైంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుండి విగ్రహం స్వాధీనం చేసుకొని గ్రామస్తులకు అప్పజెప్పారు.