వాసవి మాతకు పూలతో అలంకరణ
NEWS Oct 05,2024 07:13 am
మెట్పల్లి పట్టణంలోని వాసవి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు వాసవి మాత విగ్రహానికి పూలతో అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, చాడ సురేష్, కోట కిరణ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.