జగిత్యాల కలెక్టరేట్‌లో కాకా జయంతి
NEWS Oct 05,2024 07:19 am
జగిత్యాల కలెక్టరేట్లో దివంగత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, తదితర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.