హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు
NEWS Oct 05,2024 07:15 am
యూట్యూబర్ హర్ష సాయిపై ఓ మహిళా నిర్మాత ఓ సినిమా రైట్స్ వివాదంలో భాగంగా తనను బెదిరించి, లైంగిక దాడి చేసాడని కేసు పెట్టింది. ఈ కేసు పెట్టినప్పటి నుంచి హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు. ఇప్పటికే హర్ష సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. హర్ష సాయి కోసం గాలిస్తున్నారు.