డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ: CM
NEWS Oct 03,2024 08:19 am
ఫ్యామిలీ డిజిటల్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో నేటినుంచి డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈనెల 7 వరకు కుటుంబాల హెల్త్ ప్రొఫైల్‌ను అధికారులు రికార్డు చేస్తారని సీఎం చెప్పారు.