రామ్ చరణ్ మైనపు విగ్రహం
NEWS Sep 29,2024 04:09 pm
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(సింగపూర్)లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం వర్గాలు ఇప్పటికే చరణ్ తో ఫొటో షూట్ కూడా నిర్వహించాయి. త్వరలోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో తాను కూడా భాగం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెర్రీ అన్నారు.