పేకాట ఆడుతూ దొరికిన మహిళలు!
NEWS Sep 26,2024 11:31 am
నిజామాబాద్ పట్టణంలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి నాలుగో అంతస్థులో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది. మహిళలు పేకాట ఆడుతున్న విషయాన్ని పక్క సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.