పోలీసుల కస్టడీకి జానీ మాస్టర్!
NEWS Sep 25,2024 11:43 am
జానీ మాస్టర్ను పోలీసుల కస్టడికి ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీకి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. దీంతో చర్ల పల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు.