Logo
Download our app
139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
NEWS   Sep 25,2024 11:13 am
జగిత్యాల మండలం జాబితాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున 2 మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లోని మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గది అయ్యింది.
⚠️ You are not allowed to copy content or view source