Logo
Download our app
సంగారెడ్డిలో గుర్తుతెలియని శవం లభ్యం
NEWS   Sep 25,2024 10:02 am
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులబ్ గూర్ గ్రామ శివారులోని రైస్ మిల్ సమీపంలో బుధవారం గుర్తుతెలియని శివం లభ్యమైంది. ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.. మృతుడి వయస్సు 30-35 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గుర్తిస్తే 8612656746, 8712656719 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source