Logo
Download our app
నవోదయ దరఖాస్తు గడువు పెంపు
NEWS   Sep 24,2024 03:32 am
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source