Logo
Download our app
సింగూరు గేట్ల ఓపెన్
NEWS   Sep 23,2024 02:23 pm
భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద పెరగడంతో మ. 3:30 గంటలకు ప్రాజెక్టు 11వ నంబర్ క్రస్ట్ గేట్ 1.5 మీటర్లుక ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు. ఒక గేటు ద్వారా 8142 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. మంజీరా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source