త్రిశక్తి ఆలయంలో భవానీ దీక్ష
NEWS Sep 22,2024 11:12 am
మెట్ పల్లి పట్టణ త్రిశక్తి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఆరంభ సూచికగా జగన్మాత అనుగ్రహం కలుగాలని ఆదివారం 14 మంది 41 రోజుల భవానీ దీక్షలు స్వీకరించారు. దేవాలయ ప్రధాన పురోహితులు విధుమౌళి శర్మ ఉదయం అభిషేకం అర్చనల అనంతరం భవానీ దీక్ష చేపట్టిన వారికి దీక్ష మాలధారణ చేసి భవానీ మాత మంత్రోపదేశం చేశారు. దసరా నవరాత్రులు ఘనంగా జరగాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహం అందరికి కలగాలని ఆయన తెలిపారు.