Logo
Download our app
జలపాతం వద్ద పర్యటకుల సందడి
NEWS   Sep 22,2024 08:53 am
డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద ఆదివారం పర్యటకులు సందడి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం దేశ నలుమూలల నుండి చాపరాయి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయి వద్ద ఉన్న గార్డెన్ వద్ద పర్యటకులు సరదాగా గడిపారు, అలాగే దింసా నృత్యంలో పాల్గొని సందడి చేశారు. కబాబ్, బొంగులో చికెన్ అమ్మకాలు బాగానే జరిగిందని వ్యాపారులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source