Logo
Download our app
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
NEWS   Sep 21,2024 12:27 pm
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆయన విగ్రహానికి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు. కన్న కలలు తీరకముందే తుది శ్వాస విడిచారని, అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచిన బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన సర్వస్వం ధార పోశారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source