Logo
Download our app
RTC బ‌స్సుల్లో QR కోడ్ చెల్లింపులు
NEWS   Sep 20,2024 01:40 pm
TS RTC ప్ర‌యాణికుల కోసం త్వ‌ర‌లో QR కోడ్ చెల్లింపుల‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్ప‌టికే బండ్లగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోలోని బ‌స్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిట‌ల్ పేమెంట్ల‌ను అమ‌లు చేయగా, ఆ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. దాంతో గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌తో పాటు అన్ని ర‌కాల డిజిట‌ల్ పేమెంట్స్‌ను బ‌స్సుల్లో అనుమతించాల‌ని MD స‌జ్జ‌నార్ సిబ్బందికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్ర‌స్తుతం RTC బ‌స్సుల్లో కండ‌క్ట‌ర్లు వినియోగిస్తున్న టీమ్ మిష‌న్ల స్థానంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రికీ ఆటోమెటిక్ ఫెయిర్ క‌లెక్ష‌న్ సిస్టం మిష‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source