Logo
Download our app
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్
NEWS   Sep 20,2024 08:05 am
ఏకంగా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేశారు. ఛానెల్ హ్యాక్ చేసి.. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనే పేరును తీసేసి.. ఆ స్థానంలో రిప్పల్ పేరు పెట్టారు. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఉండే కోర్టు లైవ్ ఫీడ్, కోర్టు తీర్పుల కంటెంట్ స్థానంలో.. క్రిప్టో కరెన్సీ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇది భారీ సైబర్ ఎటాక్ గా గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోర్టు లైవ్ ప్రొసీడింగ్‌లకు బదులుగా US కంపెనీ రిప్పల్ లాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీ అయిన XRPని ప్రమోట్ చేసే వీడియోలను ఛానెల్ లో వస్తున్నాయి. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source