Logo
Download our app
సాక్షికి ప్రభుత్వ నిధులు దోచిపెట్టారు
NEWS   Sep 19,2024 04:14 pm
గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం సాక్షి ప‌త్రిక‌కు ప్ర‌క‌ట‌నల రూపంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టింద‌ని ఏపీ మంత్రివర్గం మండిపడింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు 2 ఏళ్ల‌లోనే ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు వెచ్చించారని చెప్పారు. జగన్ తన భార్య భారతి ఛైర్మన్​గా ఉన్న పత్రిక సాక్షికి వైసీపీ​ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రకటనల రూపంలో రూ.443 కోట్లు దోచిపెట్టారని, మిగతా పత్రికలన్నింటికి ఇచ్చింది కలిపినా కూడా ఇంత లేదని తెలిపింది. విచారణ జరిపించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
⚠️ You are not allowed to copy content or view source