Logo
Download our app
ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
NEWS   Sep 19,2024 06:56 am
ఆసిఫాబాద్ లోని మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం తరగతులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల 17 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో చేరారని తెలిపారు. దీంతో సరైన విద్యా బోధన జరగక తీవ్రంగా నష్టపోతున్నామని, తమ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నించారు. వెంటనే పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source