ప్రోత్సాహాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలి
NEWS Sep 18,2024 04:16 pm
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాలకు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు పొందిన, పాల్గొన్న క్రీడాకారులు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు సూచించారు. తాము పాల్గొన్న క్రీడాంశాలు, సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులను జిల్లా క్రీడల అధికారి లేదా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ద్వారా సమర్పించాలని కోరారు.