బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
NEWS Sep 18,2024 10:05 am
అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది. బీఆర్ఎస్ పార్టీకి రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు ఇచ్చింది.