అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
NEWS Sep 18,2024 06:28 am
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.