పేదలకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్
NEWS Sep 17,2024 12:29 pm
ఖమ్మం: ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి ఖాతాల్లో 12 వేల రూపాయలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మధిర నియోజకవర్గం నాగులవంచలో దళితబంధు రెండో విడత లబ్ధిదారులు 847 కుటుంబాలకు 15 కోట్ల 54 లక్షల 32 వేల 620 రూపాయల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు.