కెప్టెన్ విజయ రఘునందన్ విగ్రహ ఆవిష్కరణ
NEWS Sep 17,2024 11:58 am
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల అర్బన్ చిన్న బోనాల 10వవార్డులో భారత ప్రభుత్వ వీర చక్ర అవార్డు గ్రహీత ఆర్మీ కెప్టెన్ విజయ రఘునందన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్న బోనాలగ్రామంలో బోనాల కూచగిరిరావు కాంతమ్మల దంపతులకు జన్మించిన ఆణిముత్యం కెప్టెన్ విజయ రఘునందన్ రావువారి చిన్నతనం నుండి దేశంపట్ల ఎంతో ఇష్టంతో దేశసేవ చేయాలని కలలు కనేవాడు. అందులో భాగంగానే ఆర్మీలో ఉద్యోగం సాధించి కెప్టెన్ స్థానానికి చేరుకున్నారని తెలిపారు.