దొంగను కొట్టి పులిహోర తినిపించారు
NEWS Sep 17,2024 10:15 am
నార్కట్‌పల్లి: ఎల్లారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగ.. మంగళవారం చోరీ చేసేందుకు యత్నించి దొరికాడు. దీంతో యువకులంతా గణేష్‌ను చితకబాదారు. ఆకలిగా ఉందని గణేష్ చెప్పడంతో చలించిపోయారు. గణేషుని ప్రసాదం పులిహోర కడుపునిండా తినిపించారు. ఆ తర్వాత దొంగ గణేష్ను పోలీసులకు అప్పగించారు.