బాధితులను పరామర్శించిన మంత్రి సుభాష్
NEWS Sep 16,2024 05:15 pm
అమలాపురంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో బాణాసంచా నిల్వ ఉంచిన ఇంటిలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. సంఘటన జరగటానికి గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.