Logo
Download our app
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో శ్రవణ నక్షత్ర పూజలు
NEWS   Sep 15,2024 05:57 am
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర క్షేత్రంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని విశేష పూజలు వైభవంగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేతులైన శ్రీ స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, గణపతి హోమం, లక్ష తులసి అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రవణ నక్షత్ర మహోత్సవానికి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అంకురార్పణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు
⚠️ You are not allowed to copy content or view source