జ్వరంతో మాజీ సర్పంచ్ మృతి
NEWS Sep 13,2024 04:56 am
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ సర్పంచ్ అంకం మమత గత వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతుంది. ఆరోగ్యం క్షీణించడంతో కరీంనగర్ తీసుకెళ్లగా మార్గమధ్యలో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. 2019 నుండి 2024 వరకు సర్పంచ్ గా గ్రామానికి సేవలందించి ఇలా హటాత్తు మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.