Logo
Download our app
గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.
NEWS   Sep 12,2024 01:09 pm
సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు. పీఈటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రమేష్ కుమార్ చేరుకొని, విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే పీఈటీని తొలగించారు. అనంతరం కలెక్టర్ విద్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source