విద్యుత్ అంతరాయంపై వినతిపత్రం
NEWS Sep 12,2024 06:47 am
మల్యాల మండల కేంద్రంలోని తూర్పు వాడలోని కాలనీవాసులు తమ ఇండ్లలోని మోటార్లు, ఫ్రిడ్జ్ లు, టీవీలు, ట్రాన్స్ఫార్మర్ అధిక లోడు వలన కాలిపోతుండడంతో విద్యుత్ శాఖ ఏఈ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. రోజులో కనీసం 4,5సార్లు కరెంటు పోతుందని దాని వలన ఇబ్బందులు, నష్టం జరుగుతుందని వాపోయారు. ఈ విషయమై ఏఈ స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.