భద్రాచలం సర్వీసులు నిలిపివేత
NEWS Sep 12,2024 06:43 am
గోదావరి వరద ఉద్ధృతి, పోలీసు హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం డిపోల నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. చింతూరు సమీపంలో రోడ్డుపైకి వరద రావడంతో ఈ మార్గంలోని భద్రాచలం సర్వీసులను ఆపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు అందరూ గమనించాలని సూచించారు.