వైద్య శిబిరం: రోగులకు వైద్యసేవలు
NEWS Sep 12,2024 06:41 am
రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో నున్న తిరుమలరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణులు ఉచితంగా మందులను అందజేశారు. సుమారు వెయ్యి మంది రోగులు వైద్యసేవలు పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.