Logo
Download our app
కేసీఆర్ కల సాకారమైంది: హారిశ్
NEWS   Sep 11,2024 10:47 am
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని అన్నారు. దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని హారీష్ రావు వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source