రేవంత్ రెడ్డిని కలిసిన పవన్
NEWS Sep 11,2024 06:23 am
హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్.. రేవంత్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణలోని వరద బాధితులకు పవన్ ప్రకటించిన రూ. కోటి విరాళం చెక్కును సీఎంకి అందజేశారు.