సారా తయారీ.. కేసు నమోదు
NEWS Sep 09,2024 03:03 pm
తుని SEB స్టేషన్ పరిధిలో ఆదివారం 500 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌ఛార్జి సీఐ చిట్టిబాబు తెలిపారు. రౌతులపూడి మండలం నుంచి ములగపూడి గ్రామానికి 500 లీటర్ల నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని సారాతో పాటు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో తుని ఎస్ఈబీ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.