Logo
Download our app
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్.
NEWS   Sep 07,2024 01:01 pm
వినాయక చవితి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, ఆలయంలో నెలకొల్పిన గణనాథుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం కల్యాణ మండపంలో ప్రభుత్వ విప్ కు ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వేదోక్త ఆశీర్వచనం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source